జాతీయ సాహిత్య ఫెస్టివల్ కు రచయితలకు ఆహ్వానం

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; న్యూ ఢిల్లీలో ఇందిరాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహలయ భోపాల్,ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్ న్యూఢిల్లీ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న 10వ రాష్ట్రయ జనజాతీయ,లోక్ సంస్కృతి సాహిత్య ఫెస్టివల్ ఈనెల 25, 26, తేదీల్లో జరగనున్న జాతీయ ఫెస్టివల్ కు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంత రచయితలకు ఆహ్వానించినట్లు రచయితలు తెలిపారు.
ఢిల్లీలో జరిగేసదస్సుకు ఆదిలాబాద్ రచయితలకు ఆహ్వానం వచ్చిందని,మెస్రం మనోహర్ ఆదివాసి గోండి రచయిత మౌఖిక సాహిత్యం, గోండి కథలు చరిత్ర మీద ప్రసంగిస్తారని . తొడసం కైలాష్ గోండి భాష ప్రచురణ కానీ మౌఖిక సాహిత్యం. తొడసం దేవ రావ్ బహుభాషా విద్య బోధన భాష ప్రణాళిక, జాతీయ విద్యా విధానం 2020. డా ఇందల్ సింగ్ బంజారా సంస్క్రతి సాహిత్యం పై డాక్యుమెంటరీ అనే విషయాలపైప్రసంగించనున్నారని సదస్సుకు ఎంపికైన రచయితలు తెలిపారు.
