WPL 2025 | టాస్ గెలిచిన ముంబై…
- తొలి బ్యాటింగ్ ఆర్సీబీదే
- బెంగళూరు వేదికగా నేటి నుంచి మ్యాచ్ లు
మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు హోరాహోరీగా జరుగుతున్నాయి. కాగా, నేటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్, మాజీ డిఫెండింగ్ ఛాంపియన్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ – ముంబై ఇండియన్స్ మహిళల జట్లు పోటీపడనున్నాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్… బౌలింగ్ ఎంచుకుని బెంగళూరు జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
కాగా, ఈ సీజన్ డబ్ల్యూపీఎల్ లో వరుస విజయాలతో మంచి జోరు మీదున్న ఆర్సీబీ… నేటి మ్యాచ్ లోనూ గెలిచి టేబుల్ టాపర్ గానే కొనసాగాలని చూస్తోంది. మరోవైపు ముంబై జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఒక ఓటమితో మూడో స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి పట్టికలో టాప్ రెండు స్థానాల్లో నిలవాలని ముంబై భావిస్తోంది.
తుది జట్లు :
ముంబై ఇండియన్స్ ఉమెన్ : యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హేలీ క్రిస్టెన్ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), సజీవన్ సజన, కమలిని, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా, పరునికా సిసోడియా.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్ : స్మృతి మంధాన (కెప్టెన్), డేనియల్ నికోల్ వ్యాట్-హాడ్జ్, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రఘ్వీ ఆనంద్ బిస్ట్, కనికా అహుజా, జార్జియా వేర్హామ్, కిమ్ గార్త్, జోషిత, ఏక్తా బిష్త్, రేణుకా బిష్త్.