విశ్వంభరుడు ఐదు వందల సంవత్సరాలకు పూర్వం బెంగాలు(angst) ప్రాంతంలోని నవద్వీపంలో జన్మించారు. కాలాంతరంలో సన్యసించి శ్రీచైతన్య మహాప్రభుగా అవతరించి శ్రీకృష్ణ భక్తిని ప్రచారం చేసారు. నాటి నుంచి నేటికీ వారి శిష్యపరంపర కొనసాగుతోంది. ఒకసారి వారు దేశాటన చేస్తుండగా వారి శిష్యుడొకరు మహా భారతాన్ని ప్రవచిస్తున్నారు.
భక్తులందరూ ఎంతో తన్మయత్వంతో ఆలకిస్తున్నారు. ఆ రోజు కురుక్షేత్ర యుద్ధం(Kurukshetra War)లోని పదమూడవ రోజు అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించడం, తిరిగి రాలేక పోవడం గురించి అద్భుతంగా చెబుతున్నారు. బాలుడైన అభిమన్యుని క్రూరాతిక్రూరం(Cruelty and Cruelty)గా వధించడం అనే అంశం శ్రోతలను కన్నీరు పెట్టించింది.
ఆముదపు దీపాల కాగడాల వెలుగు వారి కన్నీళ్ళలో ప్రతిబింభిస్తోంది. వారితో బాటు ఆ శిష్యుడు కూడా ఆద్యంతం దుఃఖంతో కన్నీరు కారుస్తోనే ప్రవచిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి పులకిస్తూ తన శిష్యుల(Disciples)తో ముందుకు సాగారు శ్రీ చైతన్య మహాప్రభు. మహాభారత ప్రవచనం నిరాటంకంగా కొనసాగుతోంది.
పదహారవ రోజు యుద్ధం జరుగుతోంది. కర్ణుని రథచక్రం శాపవశాత్తు భూమిలో దిగిపోయింది. అదే సమయంలో అర్జునుని ఎంత వారిస్తున్నా వినకుండా కర్ణుని వధించాడు. ఇలా అద్భుతంగా సాగిపోతోంది ప్రవచనం. తిరిగి వస్తూ ఆరోజు కూడా చైతన్యుల వారు ఆ ప్రవచనాన్ని విన్నారు.
ప్రవచనకారుడైన తన శిష్యుడు దుఃఖంతో కన్నీరు కారుస్తోనే ప్రవచించడం చూసి ఆలోచనలో పడ్డారు. సభ ముగిసిన తరువాత శ్రీచైతన్యులు(Sri Chaitanya) ఆ కృష్ణ భక్తుని గృహానికి వెళ్ళారు. శ్రీకృష్ణుని మూర్తి ముందు కూర్చొని కన్నీరుతో విలపిస్తూనే ఉన్నాడు ఆ ప్రవచన కర్తయైన భక్తుడు, చైతన్య ప్రభువుల వారి శిష్యుడు.
ఆశ్చర్యంతో చూస్తున్న శ్రీ చైతన్య మహాప్రభువును చూసి ఒక్కసారిగా బోరుమన్నాడు. అతనిని సముదాయిస్తూ “ఎందుకు ఇలా కన్నీరు కారుస్తూ ప్రవచిస్తున్నావు?” అని అడిగారు. స్వామీ యుద్ధంలో నా కృష్ణుడి(Krishna)కి ఎన్నిగాయాలు అయ్యాయో! ఎన్ని బాణాల నుండి అర్జునిని కాపాడుతూ తాను శరాఘాతాలను తట్టుకున్నాడో కదా! కానీ ఎక్కడా ఎవరితోనూ చెప్పుకోలేదు స్వామీ!” అంటూ విలవిలలాడుతున్న ఆ శుద్ధ భక్తుని తన హృదయానికి హత్తుకున్నారు శ్రీచైతన్యులు.
ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే, భక్తి అంటే భగవంతుణ్ణి(God) కోరడం, తన కోర్కెలు తీర్చమని మొక్కులు మొక్కడాలూ అర్చనలూ-ఆరాధనలూ మాత్రమే కాదు, భగవంతుడిని నా అని భావించి అనుభూతి చెందడం…నిర్మలమైన భక్తితో ఆరాధించడం. అందులోంచి అనంతమైన ఆరాధన-అంకిత భావం(Worship-Dedicated Feeling), అచంచలమైన భక్తి జనియిస్తాయి. అది మాత్రమే మోక్షమార్గం. అంతే కానీ ప్రతిఫలాపేక్షతో పూజలు ఆచరించడం పుణ్యం వస్తుందనుకోవడం కాదు.
..వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు…

