సౌందర్య లహరి

28. సుధా మప్యాస్వాద్యప్రతిభయజరామృత్యుహరిణీం
విపద్యంతేవిశ్వే విధి శతమఖముఖాద్యాదివిషదః
కరాళంయత్క్ష్వేళంకబలితవతఃకాలకలనా
నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా!

తాత్పర్యం: జననీ! జగన్మాతా! బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవత లందరు మిక్కిలి భయంకరమైన ముసలితనాన్ని, మరణాన్ని పోగొట్టగలిగిన అమృతాన్ని సేవించి కూడా కాలానికి వశులై నశిస్తున్నారు. కాని, నీ భర్త అయిన సదాశివుడు కాలకూట విషాన్ని మ్రింగి కూడా కాలానికి వశుడు కాలేదు. దానికి నీ చెవికమ్మల ప్రభావమే కారణం అయి ఉంటుంది.

డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply