World Cup – తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష సత్తా …టోర్నిలో అద్భుత శతకం శతకం
కౌలలంపూర్ – ఐసీసీ వుమెన్స్ అండర్-19 ప్రపంచకప్‌లో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష అదరగొట్టింది. మంగళవారం స్కాట్‌లాండ్‌తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లోనే అజేయ సెంచరీ సాధించి రికార్డును నెలకొల్పింది. వుమెన్స్ అండర్-19 ప్రపంచ కప్‌లో సెంచరీ సాధించిన తొలి వుమెన్స్ క్రికెటర్‌గా నిలిచింది. అదే సమయంలో బంతితోనూ రాణించి మూడు వికెట్లు పడగొట్టింది. మలేషియాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ సూపర్ సిక్స్ మ్యాచ్‌లో స్కాట్‌లాండ్‌తో టీమిండియా తలపడింది. స్కాట్లాండ్ టాస్ గెలిచి ఫీల్డ్ ఎంచుకుంది. ఓపెనర్లు కమలిని, గొంగడి త్రిష చెలరేగి ఆడారు .ఓపెనర్లు ఇద్దరు కలిసి ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి వికెట్‌కు ఇద్దరు అజేయంగా 147 పరుగులు జోడించారు. మ్యాచ్‌లో ముఖ్యంగా తెలంగాణ అమ్మాయి త్రిష 59 బంతుల్లోనే 110 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకుపడింది. కమిలిని 42 బంతుల్లో 51 పరుగులు చేయగా.. మరో బ్యాట్స్‌వుమెన్ సానికా చల్కే 20 బంతుల్లో 29 పరుగులు చేసింది. ముగ్గురు చెలరేగడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఆ తర్వాత భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 58 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడగా.. బౌలర్లు స్కాట్లాండ్‌ను బౌలింగ్‌తో వణికించారు. ఆయుషి శుక్లా మూడు ఓవర్లు వేసి 8 పరుగులు ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టింది. వైష్ణవి శర్మ ఐదు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా.. గొంగడి త్రిష రెండు ఓవర్లు వేసి.. ఆరు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసింది.
భద్రాచలంలో వెల్లువెత్తిన సంబరాలు…
త్రిష ప్రతిభకు భద్రాద్రి వాసులు ఆనందంలో ఈ క్రమంలో అభినందన ర్యాలీ ఏర్పాటు చేశారు.గొంగడి త్రిష తండ్రి రామిరెడ్డి స్థానికంగా అందరికీ చిరపరిచితుడు, త్రిష కూడా తన బాల్యంలో ఎక్కడో చదువు కుంది. ఈ క్రమంలో నెహ్రూ కప్ క్రికెట్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి మంగళవారం సాయంత్రం 4 గంటలకు, భద్రాచలం క్రికెట్ గ్రౌండ్ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ పట్టణ ప్రజలు,పట్టణ ప్రముఖులు, పెద్దలు,వివిధ వ్యాపార వర్గాల వారు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, వివిధ ప్రభుత్వ ఉద్యోగులు, క్రికెటర్స్, క్రికెట్ అభిమానులు, ప్రెస్,ఇతర అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.