World Cup 2026 : 6 నిమిషాల్లో.. గేమ్ చేంజ్.. Andhra Prabha Sports

World Cup 2026 : 6 నిమిషాల్లో.. గేమ్ చేంజ్.. Andhra Prabha Sports
- స్కాట్లాండ్‌కు షాక్!
- 28 ఏళ్ల కల ఛిద్రం
- వరల్డ్‌కప్ ఎంట్రీలో తొలి దెబ్బ
- జపాన్ చేతిలో ఓటమి
( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ )

ఫుట్ బాల్ ప్రపంచకప్ టోర్నీలో.. అర్హతకు 29 ఏళ్లు శ్రమించిన స్కాట్లాండ్ సాకర్ జట్టు.. తొలిమ్యాచ్ లోనే జపాన్ చేతిలో ఓడిపోయింది. కేవలం ఆరు నిముషాల్లో జపాన్ జట్టు గేమ్ రిజల్ట్ ను మార్చేసింది. గ్లాస్గోలోని హ్యాంప్డెన్ పార్క్‌లో భారత కాలమానం ప్రకారం, మార్చి 28, 2026, శనివారం రాత్రి ఈ మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ ముగియడానికి కేవలం 6 నిమిషాల ముందు (84వ నిమిషం), జపాన్ క్రీడాకారుడు కెంటో షియోగాయ్ అందించిన పాస్‌ను సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన జున్యా ఇటో, గోల్‌గా మలిచాడు. మ్యాచ్ ఆరంభంలో స్కాట్లాండ్ స్టార్ మిడ్‌ఫీల్డర్ స్కాట్ మెక్‌టోమినే కొట్టిన బంతి గోల్ పోస్ట్‌కు తగిలి వెనక్కి రావడంతో స్కాట్లాండ్‌కు తొలి అవకాశం చేజారింది. ఇక మ్మాచ్ ద్వితీయార్థంలో జపాన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. సుమారు 18 సార్లు గోల్ కోసం ప్రయత్నించి, చివరకు విజయం సాధించింది.
World Cup 2026 : 28 ఏళ్ల నిరీక్షణ
స్కాట్లాండ్ చివరగా 1998లో ఫ్రాన్స్‌లో జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో ఆడింది. ఆ తర్వాత వరుసగా ఆరు ప్రపంచ కప్‌లకు (2002 నుండి 2022 వరకు) అర్హత సాధించడంలో విఫలమైంది. రోపియన్ జోన్ (UEFA) క్వాలిఫైయింగ్ రౌండ్లలో స్కాట్లాండ్ ఎప్పుడూ బాహుబలి జట్లు స్పెయిన్, నెదర్లాండ్స్ తో తల డాల్సి వచ్చేది. కేవలం గ్రూప్ విజేతలు మాత్రమే నేరుగా అర్హత సాధించే నిబంధనలు స్కాట్లాండుకు ప్రతిబంధకంగా మారాయి. అనేకసార్లు అర్హతకు చేరువగా వచ్చినప్పటికీ, నిర్ణయాత్మక ప్లే-ఆఫ్ మ్యాచ్‌లలో ఓడిపోయింది. 2022 ప్రపంచ కప్ ప్లే-ఆఫ్ సెమీఫైనల్‌లో ఉక్రెయిన్ చేతిలో 3-1తో ఓటమి పాలైంది.
World Cup 2026 : త్వరలో బాహుబలి బ్రెజిల్ తో…
చివరకు స్టీవ్ క్లార్క్ సారథ్యంలో నవంబర్ 2025లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో డెన్మార్క్‌ను 4-2తో ఓడించి, 2026 ప్రపంచ కప్‌కు స్కాట్లాండ్ అధికారికంగా అర్హత సాధించింది. స్కాట్లాండ్ తన తదుపరి సన్నాహక మ్యాచ్‌ను ఏప్రిల్ 1న ఐవరీ కోస్ట్ జట్టుతో ఆడనుంది. ఆ తరువాత బ్రెజిల్, మొరాకో జట్లతో తలపడనుంది.
