ఘనంగా ప్రపంచ టైలర్స్ డే వేడుకలు..

నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట పట్టణంలో ప్రపంచ టైలర్స్ డే ను ఘనంగా నిర్వహించారు. నర్సంపేటలో టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించి శనివారం జెండా ఆవిష్కరించారు. టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రపంచ టైలర్స్ డే కుట్టు కళకు గౌరవం తెలిపే ప్రత్యేక దినోత్సవం అన్నారు. రోజువారీ జీవితంలో దుస్తులు ఎంత అవసరమో చెప్పనక్కర్లేదు కానీ ఆ దుస్తులు మనకు అందంగా, సౌకర్యంగా తయారయ్యే వెనుక ఉన్న శ్రమను మనం చాలాసార్లు గమనించము. ఆ శ్రమకు టైలర్ (దర్జీ). కుట్టు కళను వృత్తిగా చేసుకుంటూ, మన అవసరాలకు తగినట్లుగా దుస్తులను రూపొందించే టైలర్లకు గౌరవం తెలపడానికి జరుపుకునే ప్రత్యేక దినమే టైలర్స్ డే.అన్నారు.
ఆధునిక కాలంలో టైలర్ల పాత్ర ఈరోజుల్లో రెడీమేడ్ దుస్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, కస్టమ్ టైలరింగ్కు ప్రత్యేక గుర్తింపు ఉందనీ పేర్కొన్నారు. మన శరీరానికి సరిపోయే విధంగా కుట్టించిన దుస్తులు ఆధునిక టైలర్లు కేవలం కుట్టు పనికే పరిమితం కాకుండా ఫ్యాషన్ డిజైన్, ప్యాటర్న్ మేకింగ్, ఎంబ్రాయిడరీ, స్టైలింగ్ సూచనలు ఇవన్నీ అందిస్తున్నట్లు తెలిపారు. టైలర్స్ డే అనేది ఈ నైపుణ్యాలన్ని టినీ గౌరవించే రోజు అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రైలర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రామగిరి రవి,పైతర్ వెంకటేష్, ప్రధాన కార్యదర్శిలు న్యాతిని రవి, కోశాధికారి రామగిరి రవి, కార్యవర్గ సభ్యులు ప్రకాష్, కమిటీ సభ్యులు కర్ణ కృష్ణ, మధు, సంగ సత్యనారాయణ, సాయి బాబా, గట్ల రాంచందర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
