ఘనంగా దివ్యాంగుల దినోత్సవం….

ఘనంగా దివ్యాంగుల దినోత్సవం….
దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దండేపల్లి మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో దివ్యాంగులకు సోమవారం డాక్టర్ అజయ్ కుమార్ దివ్యంగులకు పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మంత్రి రాజు మాట్లాడుతూ దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు పిల్లలపై పలు జాగ్రత్తలు తీసుకొని వారికి ప్రతిరోజు వ్యాయామం చేపించాలని అన్నారు. దివ్యాంగులు ఏ విషయం లో కూడా ఆత్మనునత చెందవద్దు అని దివ్యంగుల పిల్లల్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాము అని అన్నారు.
దివ్యాంగుల కు ప్రభుత్వం నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు, దివ్యాంగులు భవిత కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు, అనంతరం దివ్యాంగులకు ప్లేట్లు గ్లాసులను అందజేశారు. కార్యక్రమంలో భవిత కేంద్రం నిర్వాహకులు కుమార్, సౌజన్య. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సౌజన్య అంగన్వాడి టీచర్ అనసూర్య దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
