విశ్వబ్రాహ్మణ మను, మయ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక…

విశ్వబ్రాహ్మణ మను, మయ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక…
భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ పట్టణంలోని విశ్వబ్రాహ్మణ మను, మయ సంఘంలో కార్యవర్గం ఎన్నుకున్నారు. మంగళవారం ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు పాత కార్యవర్గం గడువు ముగియడంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఎన్నికలో విశ్వబ్రాహ్మణ మను, మయ సంఘ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా ముప్పారపు శ్రీధర్, కోశాధికారిగా కోటగిరి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా దడివి గంగాధర్, పెళ్లి పెద్దలుగా దేవాయి రాజశేఖర్, రాగి రవి, దడివి రాజీన్ కుమార్, నిచ్చెమొల్ల రాము, రాగి రాజేశ్వర్ లను ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన విశ్వబ్రాహ్మణ కార్యవర్గానికి సంఘ సభ్యులు స్వీట్స్ తినిపించి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ముప్పారపు శ్రీధర్ మాట్లాడుతూ సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
