ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో ఉమెన్స్ సేఫ్టీ వింగ్ అవగాహన సదస్సు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : పట్టణంలోని ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్‌లో శనివారం మంచిర్యాల ఉమెన్స్ సేఫ్టీ వింగ్ (భరోసా) ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సమాజంలో బాలికలు, స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలు, వేధింపులు మరియు చెడు ప్రవర్తన పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో ఈ సందర్భంగా వివరించారు. స్త్రీలు లేదా బాలికల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే బాధితులు లేదా వారి తల్లిదండ్రులు వెనువెంటనే ఉమెన్స్ సేఫ్టీ వింగ్ (భరోసా) కేంద్రానికి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. బాధితులకు అండగా ఉండేందుకు భరోసా టీంలో ఒక ఎస్సై, కానిస్టేబుల్, లాయర్ ఏఎన్ఎం అందుబాటులో ఉంటారని, ఫిర్యాదు అందిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భరోసా సపోర్ట్ పర్సన్ పుష్పలత, ఏఎన్ఎం ప్రమీల, పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply