చిత్తూరులో మ‌హిళా క‌మిష‌న్ విచార‌ణ‌

చిత్తూరులో మ‌హిళా క‌మిష‌న్ విచార‌ణ‌

  • మహిళల టాయిలెట్ లో సీక్రెట్ కెమెరాల‌పై ఆరా
  • విచార‌ణ‌పై విద్యార్థి సంఘాల హ‌ర్షం

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు సమీపంలోని మురకంబట్ట వద్ద ఉన్న అపోలో యూనివర్సిటీApollo University)లో మహిళల టాయిలెట్లో సీక్రెట్ గా మొబైల్ అమర్చిన కేసులో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఈ రోజు విచారణ ప్రారంభించింది. ఈ విషయమై ఆంధ్రప్రభ వెబ్ న్యూస్ లో యూనివర్సిటీ మహిళల టాయిలెట్లో సీక్రెట్ మొబైల్ కలకలం అనే శీర్షికన‌ వార్త ప్ర‌సారం కావ‌డంతో స్పందించిన మహిళా కమిషన్ కేసు నమోదు చేసింది. ఈ విషయమై విద్యార్థి సంఘాలు కూడా అపోలో యూనివర్సిటీ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేశారు.

జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి సాయనీ బుధ‌వారం అపోలో యూనివర్సిటీని సంద‌ర్శించారు. యూనివర్సిటీ యాజమాన్యం, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీ బాలికల టాయిలెట్స్‌లో సీక్రెట్ కెమెరా(Secret Camera) అమర్చడం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ విషయంలో యూనివర్సిటీ యాజమాన్యం పోలీసులు తీసుకున్న చర్యలు గురించి ఆరా తీశారు. ఈ విషయమై యూనివర్సిటీ విద్యార్థినులతో కూడా మాట్లాడారు.

పది రోజుల కిందట ఓ బాలిక టాయిలెట్ గదిలో ఉన్న సీక్రెట్ కెమెరాను గుర్తించి యూనివర్సిటీ అధికారులకు తెలియజేయడంతో అసలు విషయం బయటపడింది. సైట్ ఇంజనీర్ ఆ టాయిలెట్ లో సీక్రెట్ మొబైల్ కెమెరా అమర్చినట్లు గుర్తించారు. యూనివర్సిటీ అధికారుల ఫిర్యాదు మేరకు చిత్తూరు(Chittoor) తాలూకా సీఐ నిత్య బాబు ఇతర పోలీసులు టాయిలెట్ గదిని పరిశీలించి గదిలో అమర్చిన సీక్రెట్ మొబైల్ కెమెరా ఉండడాన్ని గుర్తించినట్లు తెలిసింది.

ఈ నెల 1న‌ టాయిలెట్స్ లో శబ్దం వస్తుందని గమనించిన ఓ విద్యార్థిని యూనివర్సిటీ రిజిస్టార్‌(Register)కు సమాచారం ఇవ్వ‌డంతో యూనివర్సిటీ రిజిస్టర్ పోతురాజు రహస్యంగా తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు. తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేటు సైట్ ఇంజనీర్ కాంతా రూబెన్, విరుద్ నగర్ జిల్లా వాసిగా గుర్తించారు. అత‌డి వద్ద నుంచి ఇప్పటికే మొబైల్, ల్యాప్టాప్(Mobile, Laptop) స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చిత్తూరు తాలూకా సీఐ నిత్య బాబు అప్పట్లో తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ విచారణ ప్రారంభించడం పట్ల యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply