Women Summit | వ‌డ్డీ లేని రుణాల‌తో మ‌హిళ‌ల‌కు స్వ‌యం ఉపాధి – డిప్యూటీ సిఎం భ‌ట్టి

హైద‌రాబాద్ – వడ్డీలేని రుణాలతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశం లభించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తోందని, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుకు ఫ్రీ లోన్లు ఇస్తున్నామని చెప్పారు. స్వయం సహాయక గ్రూపులకు రూ.20 వేల కోట్లకు పైగా లోన్లు ఇస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ తాజ్ డక్కన్ హోటల్ లో నేడు జ‌రిగిన నిర్వహించిన స్త్రీ సమ్మిట్ 2.0 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు భట్టీ. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రారంభించిన భ‌ట్టి మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసమే స్ర్తీ సమ్మిట్ నిర్వహిస్తున్నామని అన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. ఒకవైపు స్త్రీలను దేవతలుగా చూస్తేనే మరోవైపు కంట్రోల్ చేయాలనే ప్రయత్నం తరతరాలుగా జరుగుతూనే ఉందని అన్నారు. హిందూ కోడ్ బిల్లుతోనే మహిళా సాధికారత ప్రారంభం అయ్యిందని, అంబేద్కర్ వల్లే మహిళలకు హక్కులు లభించాయని గుర్తు చేశారు. మహిళలకు వారతసత్వ హక్కులు లభించాయని తెలిపారు.

తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్ స్కీం సక్సెస్ ఫుల్ గా నడుస్తోందని అన్నారు డిప్యూటీ సీఎం. సోలార్ ప్లాంట్ నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగించామని, దీంతో సోలర్ ప్లాంట్ నిర్వహణలో మహిళలకు భాగస్వామ్యం లభించిందని అన్నారు. ఇలాంటి స్త్రీ సమ్మిట్ లతో మహిళా సాధికారత సాధించవచ్చుని పిలుపునిచ్చారు.

మహిళల హక్కుల కోసం పార్లమెంట్‌లో అనేక బిల్లులు రూపొందించబడ్డాయని, ఈ దిశగా ఇందిరమ్మ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఎదగాలని ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా సంవత్సరానికి రూ. 21,000 కోట్లు విలువైన వడ్డీ లేని రుణాలు మహిళలకు అందుతుండటం విశేషమని చెప్పారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనేది త‌మ‌ ప్రభుత్వ లక్ష్యమని అని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. గ్రీన్ ఎనర్జీ రంగంలో తెరంగాణ మహిళలను భాగస్వామ్యం చేస్తున్నామని, 1000 మెగావాట్ల పునరుత్పత్తి విద్యుత్ ఉత్పత్తికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తో కలిసి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరా శక్తి క్యాంటీన్స్, ఆర్టీసీతో కలిసి మహిళలు భాగస్వామ్యం అవడం, స్థానిక సంస్థలలో 33% రిజర్వేషన్లు వంటి పలు చర్యల ద్వారా మహిళలు తమ పాదాలపై నిలబడేందుకు అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *