- ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేస్తున్నాం
- ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు
( కర్నూల్ బ్యూరో ఆంధ్రప్రభ) : ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) రాష్ట్ర కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలలో ప్రతిష్టాత్మకమైన స్త్రీ శక్తి పథకం అమలు చేసి 30 రోజులు పూర్తయిన సందర్భంగా కర్నూలు పార్లమెంటరీ సభ్యులు బస్తిపాటి నాగరాజు (Bastipati Nagaraju) తో కలిసి ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ (APSRTC Kadapa Zonal Chairman) పూల నాగరాజు కర్నూలు బస్ స్టేషన్ నందు రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలైన నేపథ్యంలో తీసుకున్న చర్యల గురించి, బస్సుల కండిషన్ల గురించి, ప్రయాణికులకు కల్పిస్తున్న మౌలిక వసతుల గురించి ఆర్టీసీ అధికారులను ఆరా తీశారు.

ఈసందర్భంగా పూల నాగరాజు మాట్లాడుతూ… కర్నూలు జిల్లా (Kurnool District) నందు ఏడు నియోజకవర్గాలలోని బస్ స్టేషన్లకు ఎం.పి నిధుల ద్వారా ఆర్వో ప్లాంట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. అనంతరం ఉచిత ప్రయాణం పట్ల మహిళల అభిప్రాయాలను జోనల్ చైర్మన్ పూల నాగరాజు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పేద, ధనిక తేడా లేకుండా కూటమి ప్రభుత్వం మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎంతో సహాయ పడుతోందని, మహిళా స్వయం సమృద్ధి (Women’s self-sufficiency) కి దోహదపడుతోందని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మహిళలందరూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు, డిపో మేనేజర్ సుధారాణి పాల్గొన్నారు.

