ఎల్లంపేట్ మున్సిపల్ లో మహిళలకు ఘనసన్మానం

ఎల్లంపేట్ మున్సిపల్ లో మహిళలకు ఘనసన్మానం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని …
మేడ్చల్, మార్చి 7 (ఆంధ్రప్రభ) : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మండలం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని మునిసిపల్ చైర్ పర్సన్ లావుడ్య శ్రీదేవి, కమిషనర్ స్వామినాయక్ ఆధ్వర్యంలో ఇవాళ మహిళా మణులకు ఘనంగా సన్మానం చేసి సత్కరించడం జరిగింది.

కమిషనర్ స్వామి నాయక్ మాట్లాడుతూ…. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, అభివృద్ధి పథంలో ముందుకెళుతూ భవిష్యత్తులో మహిళలు కీలక పాత్ర పోషించి మున్సిపల్ అభివృద్ధికి శాయాశక్తులా తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట మున్సిపల్ సిబ్బంది కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

