ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని లేడీస్ హాస్టల్ (Ladies Hostel) నిర్వాహకుడికి మహిళలు దేహశుద్ధి చేశారు. మాదాపూర్ (Madapur) ఎన్‌పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది. నిర్వాహకుడు సత్యప్రకాశ్ హస్టల్‌లో ఉంటున్న బోరబండ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ మహిళలు ఇవాళ హల్‌చల్ చేశారు.

హాస్టల్ భవన అద్దాలు, ఫర్నిచర్ (Furniture), చెట్ల కుండీలు పగలగొట్టారు. తనపై దాడి జరుగుతున్న విషయాన్ని డయల్ 100కు సత్యప్రకాశ్ సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. దాడికి పాల్పడిన మహిళలు, సత్య ప్రకాశ్‌ను మాదాపూర్‌ పీఎస్ (Madhapur PS) కు తరలించారు. అయితే బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారనేది అవాస్తవమని, అంతా అబద్ధమని హాస్టల్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టాక పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.

Leave a Reply