ఖాళీ సంచులపై మహిళలు గరం…గరం..
చండ్రుగొండ, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని రేషన్ షాపు(Ration shop)లో లబ్ధిదారులకు బియ్యంతో పాటు ఖాళీ సంచులను ఇచ్చారు. అభయ హస్తం ముద్రణ(Abhaya handprint)తో ఉన్న ఖాళీ బ్యాగులు చూసిన మహిళలు చీరలకు బదులు ఉత్త సంచులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరికొంత మంది చీరలు ఇస్తున్నారని ఆశతో రేషన్ షాపు వద్దకు చేరుకున్నారు. ఖాళీ సంచులని తెలిసి నిరాశతో వెనుదిరిగారు.

