మహిళా పోలీస్ త్రివేణికి తీవ్ర గాయాలు..

మహిళా పోలీస్ త్రివేణికి తీవ్ర గాయాలు..
తుగ్గలి, ఆంధ్రప్రభ : పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామ సచివాలయం మహిళా పోలీస్ త్రివేణికి బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో తుగ్గలి మండలం గిరిగెట్ల గ్రామం వద్ద బైక్ యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలు గురయ్యారు. దీంతో ఆమెను 108 వాహనంలో పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బుధవారం ఉదయం పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉండగా ఆమె ఒక సచివాలయ ఉద్యోగి ద్విచక్ర వాహనం పై చిన్నహుల్తికు వెళుతుండగా గిరిగేట్ల వద్ద బైక్ అదుపుతప్పి కింద పడడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో తుగ్గలిలో ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం 108 వాహనంలో మెరుగైన చికిత్స కోసం పత్తికొండకు తరలించారు. గతంలో ఈమె గిరి గేట్ల సచివాలయంలో మహిళా పోలీస్ గా విధులు నిర్వహించి చిన్నహుల్తికి బదిలీ పై వెళ్లారు.
