మరో ముగ్గురికి గాయాలు


ధర్పల్లి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ (Nizamabad) జిల్లా ధర్పల్లి (Dharpalli) మండల కేంద్రంలో కత్తెర పోట్లు కలకలం రేపాయి. ఈ రోజు ఎన్టీఆర్ కాలనీకి చెందిన వడ్ల దాసు అనే వ్యక్తి నలుగురిని దర్జీ కత్తెరతో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన మహిళ లక్ష్మీ మృతి చెందింది.

ఇలా జరిగింది…
మొదట కాలనీలో గల మచ్చ లక్ష్మీ(Maccha Lakshmi) ని కత్తెరతో పొడవగా ఆమె కూతురు గౌతమి అడ్డు వెళ్లగా ఆమెను కూడా పొడిచాడు. అక్కడ గొడవ జరుగుతుందని గమనించి పక్కింటి వారు వెళ్లగా వారిలో శెట్పల్లి నాగరాజు, అతని భార్య శోభను కూడా కత్తెరతో పొడిచాడు. అక్కడి నుండి కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్న శెట్పల్లి భోజేశ్వర్ అనే వ్యక్తి షాపు దగ్గరికి వెళ్లి అతన్ని కూడా కత్తెరతో పొదాచాడు.

ఆసుపత్రికి తరలింపు…
గాయపడ్డ నలుగురిని నిజామాబాద్ (Nizamabad) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఎవరికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. చికిత్స పొందుతున్న లక్ష్మి మృతి చెందింది.

దర్యాప్తు…
సంఘటనకు చెందిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని,ప్రస్తుతం విచారణ జరుగుతుందని పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తామని పోలీసులు (Police) తెలిపారు.

Leave a Reply