నైతిక విలువలతోనే

  • మానసిక ప్రశాంతం
  • ఆహారం బాగుందా
  • వైద్యసాయం అందుతోందా
  • లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉందా
  • పార్వతీపురం సబ్ జైలు ఖైదీలతో
  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖాముఖీ
  • విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత

పార్వతీపురం, ఆంధ్ర ప్రభ : సత్ప్రవర్తనతో శిక్షను పూర్తి చేయాలని ఖైదీలకు విజయనగరం(Vizianagaram) జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత(M. Babita) సూచించారు. జిల్లా పర్యటనలో ప్రధాన న్యాయ మూర్తి పార్వతీపురం సబ్ జైలును తనిఖీ చేశారు. జైలులో వసతులను పరిశీలించారు. జైలు పరిస్థితులు, ఆహారం, వైద్య సౌకర్యాలు, ఖైదీల శారీరక, మానసిక ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

ఖైదీలతో ముఖాముఖి(interview) మాట్లాడి మాట్లాడి నాణ్యమైన ఆహారం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆదేశించారు. చక్కటి నడవడిక, నైతిక విలువల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. జైలు(jail) రికార్డులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. జైలు లీగల్‌ ఎయిడ్‌ క్లీనిక్‌(legal aid clinic)ను తనిఖీ చేశారు.

జైలులోని పలు విభాగాలను ఆమె పరిశీలించారు. ప్రిజన్(prison) లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ గురించి ఖైదీలకు వివరించారు. ఒక అడ్వకేట్‌, పారాలీగల్‌ వాలంటీర్‌(paralegal volunteer) ఉంటారని, ఖైదీలకు అవసరమైన న్యాయసలహాలు అందిస్తారని చెప్పారు. ఖైదీల ఆరోగ్యం కోసం తీసుకుంటున్నచర్యలను న్యాయమూర్తి సబ్ జైల్ సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు.

ఖైదీల ఫిర్యాదులు, అభ్యర్థనలు, ఏవైనా సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని సబ్ జైలు అధికారులు(Officials) ఆదేశించారు. 70ఏళ్లు పైబడిన ఖైదీల(prisoners)కు, అనారోగ్యంతో బాధపడేవారికి బెయిల్‌ మంజూరయ్యేలా కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. అనంతరం భద్రతా చర్యలు, పారిశుధ్యం, జైలులోని ఇతర సౌకర్యాలను పరిశీలించారు.

ఈ పర్యటనలో పార్వతీపురం(Parvathipuram) జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. దామోదరరావు, విజయనగరం జిల్లా లీగల్ సెల్ ఆధారిటీ సెక్రటరీ ఎ. కృష్ణ ప్రసాద్(A. Krishna Prasad), పార్వతీపురం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జె. సౌమ్య జోష్ఫిన్, లోక్ అదాలత్ సభ్యులు టి. జోగారావు, మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply