ఒకే ఘటనతో.. తీర్పు..

ఒకే ఘటనతో.. తీర్పు..

బీజేపీ దిగ్గజం ఎల్.కె. అద్వానీని ఒకే ఘటన ఆధారంగా విమర్శించడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ అభిప్రాయపడ్డారు. కేవలం బాబ్రీ మసీదు కూల్చివేత (1992) ఘటనతో అద్వానీ రాజకీయ జీవితాన్ని నిర్ణయించకూడదని, అదే విధంగా జవహర్ లాల్ నెహ్రూ విషయంలోనూ ఒకే తప్పిదం (1948 హైదరాబాద్ ఆపరేషన్ పోలోలో ఆలస్యం లేదా కాశ్మీర్ సమస్య)తో తీర్పు చెప్పలేమని అన్నారు. అద్వానీ రథయాత్ర ఒక చారిత్రక ఘటన. కానీ.. 50 ఏళ్ల పార్లమెంటరీ జీవితం, హోం మంత్రిగా సేవలు, భారత రాజకీయాల్లో ఆయన పాత్రను ఒకే ఎపిసోడ్ తో కొలవడం అన్యాయం. నెహ్రుని కాశ్మీర్ లేదా చైనా యుద్ధం (1962) ఒక్కటే చూసి తీర్చు ఇస్తే ఆయన దేశ నిర్మాణ ఘనతలు మసకబారతాయి.

రాజకీయ నాయకులను వారి మొత్తం ప్రస్థానంతోనే అంచనా వేయాలని థరూర్ ఒక ఇంటర్ వ్యూలో పేర్కొన్నారు. చరిత్రలో ఎవరూ పరిపూర్ణలు కాదు.. నెహ్రు, పటేల్, ఇందిరా, వాజ్ పేయి, అద్వానీ, అందరిలోనూ బలాలు, బలహానతలు ఉన్నాయి. ఒకే కోణంలో చూడడం రాజకీయ ద్వేషాన్ని పెంచుతుందని హితవు పలికారు. ఈ పోలిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు థరూర్ వాదనను పరిపక్వతగా కొనియాడగా, మరి కొందరు బాబ్రీ కూల్చివేతను సామాన్య తప్పిదంగా చిత్రీకరించడంగా విమర్శించారు.

Leave a Reply