WIN | అభివృద్ధి చేసి చూపిస్తా..
WIN | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా మండలంలోని దానోరా సర్పంచ్ గా ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని సర్పంచ్ అభ్యర్థి సోయం సుమన్ అన్నారు. పంచాయతీ ప్రజలు ఈసారి ఎన్నికల్లో తన గుర్తు అయిన టీవీ రిమోట్ కు ఓటేసి గెలిపించాలని, తనకున్న పరిచయాలు నేతలతో ఉన్న అనుబంధం మేరకు గ్రామ అభివృద్ధికి బాటలు వేస్తానని అన్నారు. గ్రామపంచాయతీలో ఉన్న సమస్యలకు నా సొంత సమస్య లాగా భావించి నిస్వార్థ సేవలు అందిస్తానన్నారు.

