ప్రజల కొరకు పని చేస్తా

  • బుట్టాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుక్కెర కర్ల రాజేందర్

దస్తురాబాద్, ఆంధ్రప్రభ : ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కుక్కెర కర్ల రాజేందర్ తెలిపారు. ఆదివారం గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో టూత్‌పేస్ట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

గ్రామ నాయకుడిగా, ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అనుచరిగా ఉంటూ గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేయించామని రాజేందర్ పేర్కొన్నారు. సర్పంచ్‌గా గెలిచే అవకాశం కల్పిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని, గ్రామం స్వరూపం మార్చి మండలంలో ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply