చింతూరు ఆసుపత్రిలో ఒకే నెలలో సెంచరీ కాన్పులు..
చింతూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లు క్రితం విలీన మండలాలైన చింతూరు కూనవరం ఎటపాక, వరరామచంద్రాపురం మండలాలకు వైద్య సేవలు అందని ద్రాక్షా గానే మారింది. దీంతో ప్రజలు వైద్య సేవలకోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రి ప్రారంభం నుండి చింతూరులో 2018లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా అప్ గ్రేడ్ అయ్యింది.
2022 నుండి స్పెషలిస్ట్(Specialist) వైద్యులను వైద్య ఆరోగ్య శాఖ నియమించడంతో ఈ ఆసుపత్రిలో అన్నీ రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడంతో విలీన మండలాలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో కి వచ్చాయి. చింతూరు ఆసుపత్రి లో ఇద్దరు గైనకాలజిస్తులు, ఆర్థోపెడిక్ ఒకరు, జనరల్ ఫిజిషియన్ ఒకరు, చెవి ముక్కు, గొంతు(Nose, Throat) వైద్యులు, పిల్లల వైద్యులు, అనస్థిసీయా(మత్తు డాక్టర్), ఇద్దరు జనరల్ వైద్యులను నియమించడంతో ప్రజలకు మంచి సేవలు అందే అవకాశం వచ్చింది.
ప్రసవాల పై ప్రత్యేక దృష్టి..


2023లో లో డాక్టర్ ఎం. వి. కోటిరెడ్డి సూపరింటెండెంట్ గా చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి కి రావడం తో ఆయన ప్రజలకు అన్నీ రకాల వైద్య సేవల పై ప్రత్యేక దృష్టి సారించారు. ముందుగా ప్రసవాలు పెంచడం అన్ని రకాల ఆపరేషన్ లు చింతూరు లో జరిగే విధంగా ప్రయత్నించడం తో ఆసుపత్రి లో రోజు వారి ఔట్ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్(Inpatients) సేవలు బాగా పెరిగాయి.
ముఖ్యం గా ప్రసవాలు ఎక్కువగా పెరిగేందుకు చర్యలు తీసుకున్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఎం వీ కోటిరెడ్డి, మత్తు డాక్టర్ కావడం, గైనకాలాజిస్ట్ డాక్టర్ ఎం వీ రమణారావు, డాక్టర్ శశికళ సమిష్టి తో ప్రసవాల పెంపుకు కృషి చేశారు. దీంతో అక్టోబర్ లో వంద ప్రసవాలా టార్గెట్ ను సాధించారు. అల్లూరి సీతారామ రాజు జిల్లా లో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ఎక్కువ ప్రసవాలు జరిగి చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందంజ లో ఉంది.
2025 జనవరి నుండి ప్రస వాలు ..

చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి లో ఈ ఏడాది జనవరి నుండి అక్టోబర్ జరిగిన ప్రసవాల వివరాలు, జనవరిలో 64, ఫిబ్రవరిలో 48, మార్చిలో 50, ఏప్రిల్ లో 68, మే లో 48, జూన్ లో 54, జులై లో 50, ఆగస్టు లో 92, సెప్టెంబర్ లో 95, అక్టోబర్ లో 100 అయ్యాయి.
చిన్న పిల్లల యూనిట్ లో ప్రత్యేక వైద్య సేవలు ..


చింతూరు ఆసుపత్రి లో చిన్న పిల్లల వైద్య సేవల కోసం ఏర్పాటు నవజాత శిశు కేంద్రం ( ఎస్ఎన్ సీయూ) లో అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఏడాది లోపు ఉన్న చిన్న పిల్లలకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. చిన్న పిల్లల వైద్యాధికారి డాక్టర్ మహేష్(Dr. Mahesh) ఆధ్వర్యంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. చిన్న పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాకుండా శిశు మరణాలను తగ్గించేందుకు ఈ యూనిట్ ఉపయోగ పడుతుంది. చిన్న పిల్లల వైద్య సేవల కోసం పిడియట్రీషియన్, వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండడం విశేషం.
నాలుగు రాష్ట్రాల ప్రజలకు వైద్య సేవలు..
చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు రాష్ట్రాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రజలకు ఇదే ప్రధాన ఆసుపత్రి, చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి లో స్పెషలిస్ట్ వైద్యులతోపాటు స్కానింగ్, ఎక్స్‌రే, అన్ని రకాల రక్త పరీక్షలు, డా. ఎన్టీఆర్ వైద్య సేవలు, డయాలసిస్ సేవలు, ఎన్ ఆర్ సీ కేంద్రం, ఎస్ఎన్సీయూ(SNCU) కేంద్రం ఉండడంతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.
జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, చింతూరు ఐటీడీ ఏ ప్రాజెక్టు అధికారి శుభం నొక్వాల్, డీసీ హెచ్ ఎస్ డాక్టర్ నీలవేణి డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ పుల్ల య్య సహకారం తో ఆసుపత్రి లో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి ఇటీవల వంద పడకల ఆసుపత్రి గా అప్ గ్రేడ్ గా చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్(Green Signal) ఇచ్చింది.
దీంతో ఇక్కడ ప్రజలకు త్వరలో నే ఇంకా మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. చింతూరు ఆస్పత్రిలో ఖాళీ గా ఉన్న స్పెషలిస్ట్ వైద్యాధికారుల పోస్ట్ లు భర్తీ చేయాలి. ప్రస్తుతం జనరల్ ఫిజిషియన్, ఈ ఎన్ టీ, ఆర్థోపెడిక్, పెడియట్రిక్ వైద్య పోస్టులు భర్తీ చేస్తే ఇంకా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించ వచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

