ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన ఘటన ఆదివారం రాత్రి నల్లగొండ(Nalgonda) జిల్లా దేవరకొండ(Devarakonda) పట్టణంలోని జంగాల కాలనీలో జరిగింది. పోలీసులు(police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి మృత దేహాన్ని తరలించారు.

హత్య జరిగిందిలా…
హత్యకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వంట మాస్టర్ గా పనిచేసే గణేష్(Ganesh) తన భార్య రేణుక(Renuka) (28)తో కొద్ది రోజులుగా జంగాల కాలనీలో నివాసం ఉంటున్నాడు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య తగాదాలు జరుగుతున్నాయి . ఆదివారం రాత్రి కూడా ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ జరగడంతో భార్య రేణుక తలపై రోకలిబండతో గణేష్ బలంగా కొట్టడంతో ఆమె మరణించింది.

Leave a Reply