శ్రీ సత్యసాయి బ్యూరో, ఆగస్టు 18 (ఆంధ్రప్రభ) : భర్త ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీసత్యసాయి జిల్లా (Sri Sathya Sai District) ముదిగుబ్బ మండలం యాకర్లకుంటపల్లి (Yakarlakuntapalli)లో చోటు చేసుకుంది. మహారాష్ట్ర (Maharashtra) కు చెందిన సుధీర్ కట్కర్, నీమా కట్కర్ (18) ముదిగుబ్బలో బొగ్గులు కాల్చే పని చేస్తుంటారు.
సుధీర్ కట్కర్ (Sudhir Katkar) ను ఫోన్ ఇవ్వమని నీమా కట్కర్ (Neema Katkar) అడిగింది. ఫోన్‌లో ఛార్జింగ్ లేదని చెప్పడంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన నీమా గుడిసె సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యపు పాల్పడింది. విషయం తెలుసుకున్న ముదిగుబ్బ పోలీసులు (Mudigubba Police) సంఘటన స్థలానికి చేరుకొని, పరిస్థితిని సమీక్షించి యువతి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.