why2fight |పంచాంగ శ్రవణంలో ట్రంప్ కి పంచ్.

why2fight |పంచాంగ శ్రవణంలో ట్రంప్ కి పంచ్.

why2fight | అధ్యక్షుడి ఆత్మశోధనకిదే సమయం
అమెరికన్లలో పెరుగుతున్న ఆవేదన
యుద్ధాలపై ప్రజల అసంతృప్తి
ఇరాన్ ఎదురుదెబ్బ… ట్రంప్‌కు సవాల్
అహంభావం vs వాస్తవం

why2fight | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒక దేశాధ్యక్షుడి పనేంటి? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? అవును…ఇప్పుడు అమెరికన్లందరూ అదే ప్రశ్నను తమలో తామే వేసుకుంటున్నారట. ఎందుకో తెలుసా? తామందరూ కలిసి అమెరికా అధ్యక్షునిగా Donald Trump ని ఎన్నుకున్నది ఎందుకని? అంటే, తమని పరిపాలించడానికా, లేక ప్రపంచ దేశాలను రెచ్చగొట్టి, కయ్యానికి కాలు దువ్వి, లొంగదీసుకుని, ఆక్రమించుకుని మరికొన్ని దేశాలను సుంకాలతో బెదిరించి, స్నేహ సంబంధాలను దెబ్బదీయడానికా అని. అవును మరి వారి ఆవేదనలో అర్థం ఉంది.

పాలన గాలికొదిలేసి, ప్రజల నుంచి పన్నుల రూపేణా వచ్చిన సొమ్మంతా యుద్ధాల పేరిట తగలబెడుతూంటే ఏ దేశ ప్రజలు మాత్రం హర్షిస్తారు? ఇప్పుడే దేశ ప్రజలూ యుద్ధాలను కోరుకోవడం లేదు. అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులు, మెరుగైన జీవన విధానం—ఇవి అందించిన పాలకుడే నిజమైన సమర్థుడు. ఏ దేశ ప్రజలకైనా.

why2fight
why2fight

ఇవన్నీ వదిలేసి, అభివృద్ధిని అవతలికి విసిరేసి, ఆయుధాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతోన్న ట్రంప్ కి Iran రూపంలో గట్టి దెబ్బే తగిలింది. ట్రంప్ లోని అహంభావం, ఇగోకి ఇరాన్ తగ్గేదేలే అంటూ దృఢంగా ఎదురు నిలిచి పోరాడుతోంది. అయినా మేకపోతు గాంభీర్యంతో ముందుకే అంటోన్న ట్రంప్ కి ఎవరు చెప్పాలి? పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి?

ట్రంప్ పంచాంగ శ్రవణం కోసం బుద్ధిగా కూర్చుంటే, అయ్యవారు ట్రంప్ లోని అవలక్షణాలను పరోక్షంగా ఎత్తిచూపుతున్నట్లున్న ఈ కార్టూన్ ఒక వ్యంగ్య అద్దం, ఒక బలమైన సందేశంగా నిలుస్తోంది.

click here to more cartoons

click here to read more funtoons

Leave a Reply