దశరధుడు రాముడిని అడవికి పంపింది కైక మీద వ్యామోహంతో కాదు ఆమెకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడడానికి అనగా సత్యవాక్య పరిపాలన మీద వ్యామోహంతోనే అని తెలుసుకోవాలి. భగవంతుని పుత్రునిగా పొందగలిగినా అరిషడ్వర్గాలని జయించజాలమని, కామ క్రోధాలకు దాసుడై భగవంతుని కూడా దూరం చేసుకుంటారనడానికి ఇది ఒక ఉదాహరణ.
శంబరాసుర యుద్ధంలో తనను కాపాడినందుకు దశరధుడు కైకకు ఇచ్చిన రెండు వరాలను గుర్తు. చేయమని మందర కైకకు చెప్పింది. ఆ వరాలను కోరినపుడు ఇవ్వకుంటే మాట తప్పినట్టేనని సత్యాన్ని తప్పనివారు పొందిన గొప్ప ఫలితాలను కీర్తిని దృష్టాంతగా కైక చెప్పినది. సత్యం తోటే నదులు ప్రవహిస్తున్నాయని, సముద్రం హద్దుమీరడం లేదని, పర్వతాలు భూమిని మోస్తున్నాయని, అన్న మాట నిలబెట్టుకోవడానికే శిబిచక్రవర్తి తన శరీరాన్ని కోసి ఇచ్చాడని. దృష్టాంత పరంపర చెప్పి సత్యం కావాలో, కుమారుడు కావాలో తెల్చుకొమంది కానీ భార్య ప్రస్తావన తేలేదు కైక. తండ్రిని సత్యం తప్పడం నుంచి రక్షించడానికి, అతనికి స్వర్గం లభించడానికి తాను అడవికి పయనమయ్యాడు రాముడు. తండ్రి మాటకోసం రాముడు, తనకిచ్చిన మాట నిలబెట్టమని కైక, సత్యవాక్య బద్దుడై దశరధుడు మాట్లాడారు కానీ కైక మీద వ్యామోహం అన్ని మరో కోణం లేదు. కృత, త్రేత, ద్వాపరయుగాలలో అన్నింటికంటే విలువైనది మాట నిలబెట్టుకోవడం, సులువైనది మాట తప్పడం. సత్య ప్రభావాన్ని వర్ణించడానికి వాల్మీకి రామాయణాన్ని రచించాడు.
దశరధునికి కైకమీద అంత వ్యామోహం ఎందుకు?
