అభివృద్ధి కుంటుప‌డుతోంది

అభివృద్ధి కుంటుప‌డుతోంది

గ్రామ సేవకుల‌ను నియ‌మించాలి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు మాజీ డైరెక్టర్ లింగాల కిష్ట గౌడ్


బిక్కనూర్, ఆంధ్రప్రభ : గ్రామ సేవకులు లేకపోవడంతో అభివృద్ధి కుంటు పడుతుందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District) సహకార బ్యాంకు మాజీ డైరెక్టర్ (Former director) లింగాల కిష్ట గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన బిక్కనూరు మండల కేంద్రంలో మాట్లాడారు. గతంలో ప్రతి గ్రామంలో గ్రామ సేవకులు ఉండడం వల్ల మంచి చెడు వారు చూసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లే వారని చెప్పారు.

గ్రామాల్లో ఉన్న చెరువు బాధ్యతలను ప్రస్తుతం ఎవరూ పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం (Government) తగు చర్యలు తీసుకొని గ్రామ సేవకులను తక్షణమే నియమించాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం పంపించడం జరిగిందని ఆయన తెలిపారు. స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు నర్సింగరావు ఉన్నారు.

Leave a Reply