శర్కరాన్నం గుడాన్నంచ పాయసం దధి సర్పిషీ
అన్నం చతుర్విధం తుభ్యం అర్పయామి జగత్పత
అతిగా శర్కరాన్నం, గూడాన్నం, పాయసం, నెయ్యి ఇంకా ఇతర పిండి వంటలు జగత్పతీ నీకు అర్పిస్తున్నాను. ఆనందంగా భుజించుము. భగవంతుడికి ఏమి నివేదన చేసినా పై మంత్రమును పఠించవలెను. సాత్వికాహారమును మాత్రమే స్వామికి నివేదన చేయాలి. వంట పదార్ధములు మన కోసం కాక స్వామికోసమే చేస్తున్నామని భావనతో తయారు చేయాలి. స్వామికి నవదన చేసిన ప్రసాదమునే మనము భుజించాలి.