- యువకుడి మృతదేహం
కొత్తూరు (రంగారెడ్డి జిల్లా) : ఓయో హోటల్ (OyoHotel) రూమ్‌ను లాడ్జి బాయ్ శుభ్రపర్చడానికి వెళ్లి చూసే సరికి ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో కంగారుగా పరుగెత్తుకుని మేనేజర్‌కు చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు (police) తక్షణమే రూమ్‌కు వచ్చి ఆ యువకుడి వివరాలు సేకరించారు. మృతిచెందిన యువకుడు కేశంపేట మండలం సంగెం గ్రామానికి చెందిన రమేష్‌గా గుర్తించారు. గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్మికుడి (Sanitation worker) గా పనిచేస్తున్నాడు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం… కొత్తూరు పట్టణం (Kothur town) లో రుహిక ఓయో హోటల్‌లో రమేష్ రూమ్ తీసుకున్నాడు. బుధవారం ఉదయం లాడ్జి బాయ్ (Lodge Boy) రూమ్‌కి వెళ్లగా అక్కడ తలుపులు తెరచి ఉన్నాయి. దీంతో వెంటనే మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లాడు. మంగళవారం మధ్యాహ్నం రుహిక ఓయో హోటల్ లో రూమ్ తీసుకున్నాడు. రమేష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.