ఆగిన కొనుగోళ్లు..
వరంగల్, ఆంధ్రప్రభ : ఈ రోజు తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షంతో మార్కెట్లకు సరుకులు తీసుకొచ్చిన రైతులు(Farmers) ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆసియా ఖండం(Asian continent)లోనే రెండవ అతిపెద్ద మార్కెట్ గా పేరుగాంచిన వరంగల్ (ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్లో(market) మక్కలు తడిసి పోయాయి.
మక్క ధాన్యంలో ఉన్న తేమ ఆరి పోవడం కోసమై మార్కెట్ షేడ్స్ పక్కన గల ఆరుబయట ఆరబోశారు. ఒకేసారి వర్షం ప్రారంభమై ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో వర్షానికి మక్కలు తడిసి పోవడంతో ఖరీదుదారులు కొనుగోళ్ళు(purchases) చేయడానికి ఆసక్తి చూపడం లేదు. వర్షం కారణంగా ఆరుగాలం శ్రమించిన తమకు ఆర్ధిక నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు
తడిసిన మొక్క జొన్న
కాశీబుగ్గ , ఆంధ్రప్రభ : ఏనుమముల వ్యవసాయ మార్కెట్ లో అకాల వర్షానికి మొక్క జొన్నలు తడిసిపోయాయి. మార్కెట్ యార్డులో టార్పాలిన్ పరదలు ఇవ్వకపోవడంతో రైతులు అధికంగా నష్టపోయారు. మొక్క జొన్న తడవడం వల్ల ధర తగ్గిపోతుందని, తద్వారా పంటకు తగిన గిట్టుబాటు రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన మొక్క జొన్నను రైతులు ఆరబెడుతున్నారు.


