2024లో అత్యధిక ఈఎస్ జీ రేటింగ్‌ను సాధించిన వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ !
హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : హోమ్ టెక్స్టైల్ విభాగంలో ప్రపంచ అగ్రగామి సంస్థ ఆయిన వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ (డబ్ల్యూఎల్ఎల్), సస్టైనబిలిటీలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంటూ , 2024 ఎస్ అండ్ పీ గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్‌మెంట్ (సీఎస్ఏ)లో మొత్తం ఈఎస్ జీ స్కోరు 83ని సాధించింది.
ఈవిజయంపై వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ ఎండి అండ్ సీఈఓ దీపాలి గోయెంకా మాట్లాడుతూ… ఈ సంవత్సరం ఎనభై మూడు స్కోరుతో ఎస్ అండ్ పీ సీఎస్ఏ లో టెక్స్టైల్, అపెరల్ అండ్ లగ్జరీ గూడ్స్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానాన్ని సాధించడం పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామన్నారు. ఈ విజయం తమ మొత్తం బృందం కృషి, అంకితభావానికి నిదర్శనం, వారు తమ వ్యాపారంలోని ప్రతి అంశంలో పర్యావరణ అనుకూల వ్యాపార విధానాలను ఏకీకృతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.
అధ్యక్షుడు, గ్రూప్ హెడ్ – సస్టైనబిలిటీ, అలోక్ మిశ్రా మాట్లాడుతూ… తమ ఈఎస్ జీ స్కోర్‌లో ఈ అద్భుతమైన మెరుగుదల కంపెనీ ఈఎస్ జీ ప్రమాదాలను సమగ్రంగా పరిష్కరించడానికి, భవిష్యత్తుకు సిద్ధంగా వున్న సంస్థగా తీర్చిదిద్దటానికి తాము చేసిన ప్రయత్నాల ఫలితమన్నారు. ఆర్థిక వృద్ధి, పర్యావరణ నిర్వహణ పరస్పరం అనుసంధానమై ఉన్నాయనే తమ నమ్మకానికి ఇది రుజువన్నారు. మెరుగైన ప్రపంచం కోసం ప్రభావ ఆధారిత పరిష్కారాలను సృష్టించడం అనే తమ దీర్ఘకాలిక లక్ష్యం వైపు పనిచేయడం కొనసాగించడానికి ఈ విజయం మమ్మల్ని తిరిగి శక్తివంతం చేస్తుందన్నారు.