మక్తల్ , ఆగస్టు 15 (ఆంధ్రప్రభ) : 79వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (vakiti srihari) ఇవాళ నారాయణ పేట జిల్లా మక్తల్ (makthal) పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… స్వాతంత్ర ఫలాలను ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం (People’s government) పనిచేస్తుందన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడక గత పదేళ్లు పాలనలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ (Double bedroom) అందని ద్రాక్షగానే మారిందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాడ్డాక ప్రతి పల్లెలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లలో మంజూరు చేయడం జరిగిందన్నారు.

ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లను ప్రజా ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు (Welfare schemes) ప్రజలకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జి. లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయ రవికుమార్, కోళ్ళ వెంకటేష్, నూరుద్దీన్, బి.శంషొద్దీన్, అబ్దుల్ రెహమాన్, బోయ వెంకటేష్,కావలి తాయప్ప, గోవర్థన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply