welcomes | సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన యార్లగడ్డ

welcomes | గన్నవరం, ఆంధ్రప్రభ : దావోస్ పర్యటనను ముగించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఉదయం ఉండవల్లికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి దావోస్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. నాలుగు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు 36కి పైగా కీలక సమావేశాల్లో పాల్గొన్నారని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.

ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు, పరిశ్రమల ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. ఈ దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే దిశగా కీలక ముందడుగు పడిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా నిలిపే లక్ష్యంతో చేపట్టిన సీఎం దావోస్ పర్యటన విజయవంతమైందని ఎమ్మెల్యే యార్లగడ్డ తెలిపారు.

Leave a Reply