Weekend Effect |  గోల్డ్​ స్పీడ్​..స్లో..

Weekend Effect |  గోల్డ్​ స్పీడ్​..స్లో..

  • లాభాల వేటలో మదుపర్లు
  • $4,299  టూ  $4,290

Weekend Effect | బిజినెస్​ డెస్క్ , ఆంధ్రప్రభ : ఈ ఏడాది బంగారం ధర దూసుకుపోతోంది. గత ఏడాదితో పోల్చితే బంగారం ధర 60 శాతం పెరిగింది. తాజాగా.. మదుపర్లు లాభాలను మూటగట్టుతున్న తరుణంలో.. కొత్త బంగారం లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి.  శనివారం ఉదయం ₹ 100లు  పెరిగిన ధర మధ్యాహ్నం 2,00 గంటలకు తగ్గిపోయింది

Weekend Effect

మదుపర్లు తమ బంగారాన్ని వీడి లాభాలను జమ చేసుకొంటున్నారు. ఈ స్థితిలో  13 డిసెంబర్ 2025న బులియన్ మార్కెట్‌లో బంగారం ధర కాస్త తగ్గింది. భారతదేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹1,33,000 నుంచి ₹1,34,000 మధ్య ఉంది  నగరాల్లో లావాదేవాల పరిస్థితి ఆధారంగా  స్వల్ప వ్యత్యాసాలు నమోదు అవుతున్నాయి.  10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ₹ 270 లు తగ్గింది.

Weekend Effect

శుక్రవారం 1,34,180లు పలికిన బంగారం ధర శనివారం 1,33,910లకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 250లు తగ్గింది. 1,23,000 పలికిన ధర 1,22,750లకు చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర 210లు తగ్గింది. 1,00,640లు పలికిన బంగారం ధర 1,00,430లకు చేరింది. అకస్మాత్తుగా బంగారం ధర స్వల్పంగా నేల చూడటానికి కారణమేంటంటే.. డిసెంబర్ 13-, 14 తేదీల్లో   గోల్డ్ మార్కెట్‌ పై  వీకెండ్ ఎఫెక్ట్ పడింది.   నాన్-ట్రేడింగ్ డేస్ కావడంతో, వ్యాపారులు  పొజిషన్లు మూసివేయడంతో తగ్గాయి.   

Weekend Effect

 ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి  $4,300  చేరుకోవటంతో..  పెట్టుబడిదారులు లాభాలు బుకింగ్​ షురూ చేశారు. మార్కెట్​ పై  లాభాల వేట  ఒత్తిడి పెరిగింది. గ్లోబల్ స్పాట్ గోల్డ్ ధర $4,299 నుంచి కొంత తగ్గి $4,290 దగ్గర ట్రేడవుతోంది.  డాలర్ ఇండెక్స్ స్వల్పంగా బలపడింది, యు.ఎస్. ట్రెజరీ యీల్డ్స్ ఊపు పెరిగింది. ఫలితంగా  బంగారం విక్రయాలపై ఒత్తిడి తప్పలేదు.

Weekend Effect

డిసెంబర్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్  రేట్ కట్ చేసినా, 2026లో మరిన్ని కోతలు ఉంటయనే భావనతో  అనిశ్చితి తగ్గు ముఖం పట్టలేదు.  ఇది సేఫ్ -హెవెన్ డిమాండ్‌ను కొంత తగ్గించింది.తాజాగా శనివారం మధ్యాహ్నం 12.00 గంటలకు బులియన్​ మార్కెట్​ స్థితి ఇలా ఉంది. డిసెంబర్ 13, శనివారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల 10  గ్రాముల  బంగారం  ధర ₹.134,180  వద్ద ప్రారంభం కాగా ₹ 270 . తగ్గింది. ఇక 22 క్యారట్ల 10  గ్రాము బంగారం ధర ₹ 1,23,000 వద్ద  ప్రారంభం కాగా ₹259లు తగ్గింది.    18 క్యారట్ల 10 గ్రాము బంగారం ధర ₹.1,00,640ల  ప్రారంభం కాగా.. ₹ 210లు తగ్గింది

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర  ప్రస్తుతం ₹ 1,33,910లకు చేరింది. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం  ధర ₹ 1,22,750లకు చేరింది పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర ₹ 1,00,430లకు చేరింది..

Weekend Effect

విజయవాడలో  10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర  ప్రస్తుతం ₹ 1,33,910లకు చేరింది. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం  ధర ₹ 1,22,750లకు చేరింది పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర ₹ 1,00,430లకు చేరింది.

విశాఖపట్నంలో.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర  ప్రస్తుతం ₹ 1,33,910లకు చేరింది. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం  ధర ₹ 1,22,750లకు చేరింది పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర ₹ 1,00,430లకు చేరింది..

Weekend Effect

చెన్నైలో బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర₹ 1,34,950  దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర ₹.1,23,700 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర ₹.1,03,300 గా నమోదైంది.

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర ₹.1,33,360 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర ₹.1,22,260 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర ₹ 1,00,600 గా నమోదైంది.

Weekend Effect

ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,34,230 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర ₹ 1,23,050 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర ₹ 1,00,690 గా నమోదైంది.

కలకత్తాలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర ₹ 1,34,180 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర ₹1,23,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర ₹ 1,00,640 గా నమోదైంది.

CLICK HERE TO READ రాజధాని రైతుల సమస్యపై సమీక్ష

CLICK HERE TO READ MORE

ALSO READ : https://en.wikipedia.org/wiki/Bullion

Leave a Reply