ఏపీలో వినాయ‌క మండ‌పాల అనుమ‌తికి వెబ్‌సైట్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌సైట్ : ఏపీలో వినాయక చవితి సంద‌డి మొద‌లైంది. ఇప్ప‌టికే చాలామంది మండ‌పాల ఏర్పాటును మొద‌లెట్టేశారు. విగ్ర‌హాలను కూడా కొనుగోలు చేశారు. అయితే వినాయ‌క మండ‌పాల (Vinayaka Mandapala) ఏర్పాటుకు అనుమ‌తులు త‌ప్ప‌ని స‌రి అంటున్నారు. పోలీసులు. మండపాలకు అనుమతులు ఇచ్చే విధానంలో పొరపాట్లు జరగకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ (Andhra Pradesh Police Department) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందు కోసం ganeshutsav.net అనే వెబ్‌సైట్‌ను రూపొందించింది. మండపాల నిర్వాహకులు ఈ వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్‌లో అప్లై చేసి అనుమతులు(Permissions) పొంద వచ్చు. మండపాల నిర్వాహకులు ఈ వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్‌లో అప్లై చేసి అనుమతులు పొంద వచ్చు. అనుమతులు పొందడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎలా అప్లై చేయాలి?

  • వెబ్‌సైట్‌ ganeshutsav.netలోకి వెళ్లాలి. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత అప్లై హియర్‌ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి. అలా చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. వినాయక సమితి(Vinayaka Samiti)కి చెందిన వ్యక్తుల ఫోన్‌ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఆ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని 30 సెకన్స్‌లో ఎంటర్ చేయాలి. అలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ పూర్తి వివరాలు అందివ్వాలి. అలా పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.

కావాల్సిన వివరాలు?.
అప్లికేషన్ ఎవరి పేరు మీద ఇస్తున్నారో వాళ్ల పేరు రాయాలి. దరఖాస్తుదారు ఈమెయిల్ ఐడీ. దరఖాస్తుదారు (Applicant) అడ్రెస్‌. దరఖాస్తుదారునికి చెందిన సంఘం పేరు కూడా రాయాలి. వినాయక విగ్రహం (Vinayaka Statue) ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో చెప్పాలి. అంటే అపార్టమెంట్‌లోనా లేగా గుడిలోనా, కమ్యూనిటీ హాల్, ప్రైవేట్ ప్లేస్, పబ్లిక్ ప్లేస్‌(Community Hall, Private Place, Public Place), అనేది స్పష్టంగా చెప్పాలి. వినాయక విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతానికి డోర్ నెంబర్ లాంటిది ఉంటే ఇవ్వాలి(ఇది ఆప్షన్ మాత్రమే). వినాయక విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతం, కాలనీ పేరు. వినాయక విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతం ఏ కమిషనరేట్ పరిధిలోకి లేదా జిల్లా పరిధిలోకి వస్తుందో చెప్పాలి. ఆ ప్రాంతం ఏ సిటీ పరిధి, సబ్‌డివిజన్ కిందకు వస్తుందో తెలియజేయాలి. వినాయక విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతం ఏ పోలీస్‌ లిమిట్‌లోకి వస్తుందో స్పష్టం చేయాలి. మీరు ఏర్పాటు చేసే విగ్రహం ఎత్తు కూడా చెప్పాలి. మీరు విగ్రహం ఉంచే మండపం ఎత్తు చెప్పాలి. వినాయక ఉత్సవాలు చేసే కమిటీలోని ఐదుగురు సభ్యుల పేర్లు వారి ఫోన్ నెంబర్‌లను తెలియజేయాలి. వినాయక విగ్రహాన్ని ఏ తేదీన ఎన్ని గంటలకు నిమజ్జనం చేస్తారో ముందే చెప్పాలి. వినాయక విగ్రహాన్ని ఏ ప్రాంతంలో నిమజ్జనం (Nimajjanam) చేస్తారో కూడా తెలియజేయాలి. వినాయక విగ్రహాన్ని ఎలా నిమజ్జనం చేస్తారో వివరించాలి. అంటే స్పాట్‌లోనే నిమజ్జనం చేస్తారా లేదా ఏ వాహనంలో తరలిస్తారో పేర్కొనాలి.

Leave a Reply