నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి..

నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి..
కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కా మహబూబ్ రెడ్డి
తొర్రూరు, ఆంధ్రప్రభ : బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మడిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జక్కా మహబూబ్ రెడ్డి,జక్కా ఇంద్రసేనారెడ్డిలు బుధవారం మండలంలోని హరిపిరాల గ్రామానికి చెందిన పులుగుజ్జా అనూష(25),ఎర్రబోయిన లింగయ్య(90),బొంత రాజు(30)లు వివిధ కారణాలతో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను సందర్శించి పరామర్శించారు.
అనంతరం మూడు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 కేజీల చొప్పున 75 కేజీల బియ్యం, ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున రూ.9 వేల రూపాయలు నగదు అందజేశారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మహబూబ్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపీసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిల సహకారంతో బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు.పేద బాధిత కుటుంబాలకు ప్రతి ఒక్కరు అండగా నిలిచి ఆదుకోవాలన్నారు.
మండలంలోని వివిధ గ్రామాలలో పేద కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తానన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అందే సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు చెవిటి సదాకర్, మడిపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు వెన్నెం సోమిరెడ్డి, హరిపరాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, 1వ వార్డు మెంబెర్ తోట అశోక్, 4,6వ వార్డు సభ్యులు రామగిరి రమ సురేష్, వల్లపు సైదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల వెంకటరెడ్డి, చిరబోయిన కృష్ణ యాదవ్, వల్లపు రాఘవులు, లింగన్న, పనికర కొమురయ్య, దాసరి సాగర్, మహంకాల సంపత్, శనిగరం శివశంకర్, వెంకన్న, మురళి, మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గద్దల పరశురాములు, గ్రామ యూత్ అధ్యక్షులు గద్దల మధుకర్, వెంకన్న, లింగన్న, నాగన్న, ప్రశాంత్, ముకేశ్, మురేష్, సాగర్, రామకృష్ణ, యర్రం రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
