వికారాబాద్, జులై 22 (ఆంధ్రప్రభ): బనకచర్ల (Banakacharla) పై తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ కళాశాలలో విద్యార్థులను చైతన్యవంతం చేస్తామని బీసీ కమిషన్ మాజీ మెంబర్ (BC Commission Former member), ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్ ఎస్ వి ఇంచార్జ్ శుభప్రద పటేల్ (Shubhaprada Patel) పిలుపునిచ్చారు.
మంగళవారం వికారాబాద్ (Vikarabad) జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు. వికారాబాద్ పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్, మాజీ జడ్పిటిసి మైపాల్, వికారాబాద్ మండలం టీఆర్ఎస్ అధ్యక్షుడు మైపాల్ రెడ్డి, నాయకులు సురేష్ రవిశంకర్ తదితరులతో కలిసి ఆయన ఈ కరపత్రాన్ని విడుదల చేశారు.
ఈసందర్భంగా శుభప్రద పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణకు బనకచర్ల ద్వారా ఎంతో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బనకచర్ల నిర్మిస్తే తెలంగాణ పూర్తిగా ఎడారిగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థులను చైతన్యవంతం చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి, బాలరాజ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

