ఎమ్మెల్యే రామాంజనేయులు

ఎమ్మెల్యే రామాంజనేయులు

వట్టిచెరుకూరు, ఆంధ్రప్రభ : రానున్న బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించి నల్లమడ వాగును ఆధునీకరిస్తామని ప్రత్తిపాడు శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాలైన కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో గురువారం ఎమ్మెల్యే అధికార యంత్రాంగంతో కలసి పర్యటించారు. రైతులు నల్లమడ వాగు బాగుచేయకుంటే ప్రతి ఏడాది పంటల ద్వారా రైతులు పూర్తిస్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులతో మాట్లాడుతూ..రానున్న బడ్జెట్ సమావేశాలలో నల్లమడ వాగు అభివృద్ధికి తప్పనిసరిగా నిధులు మంజూరయ్యేవిధంగా కృషి చేస్తామన్నారు. నల్లమడ వాగు ఆధూనీకరణకు సుమారు నాలుగు వందల యాభై కోట్లు రూపాయలు అవసరం కానున్నట్లు చెప్పారు.

నియోజకవర్గంలోని కాకుమాను మండలం అప్పాపురం, కొండపాటూరు గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు పర్యటించారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నల్లమడ వాగు అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తే రివర్స్ టెండర్ పేరిట వైకాపా ప్రభుత్వం మురగపెట్టిందని గుర్తుచేశారు. వచ్చే సంవత్సరం వర్షకాల సమయానికి నల్లమడ, కృష్ణ కెనాల్ రెండు తప్పనిసరిగా ఆదునీకరణ చేయడం జరుగుతుందని రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి నేతలు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply