చారిత్రాత్మక ఆలయాలను అభివృద్ధి చేస్తాం..

చారిత్రాత్మక ఆలయాలను అభివృద్ధి చేస్తాం..

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయాలను అభివృద్ధి పరుస్తామని ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం ఆయన నల్లగొండ పట్టణ సమీపంలోని పురాతన పానగల్ పచ్చల, ఛాయా సోమేశ్వరాలయంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందల ఏళ్ల చరిత్ర గలిగిన ఈ చారిత్రాత్మక ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ ఆలయాలను యునెస్కో గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.11-12వ శతాబ్దాలకు చెందిన ఈ ఆలయాలలో అద్భుత శిల్పకళ ఉట్టిపడుతుందన్నారు. ఛాయా సోమేశ్వరాలయం గర్భగుడిలో ఎప్పుడు ఒకేలా నీడ నిచ్చలంగా ఉండడం ఇక్కడ ఒక అద్భుతం అని మంత్రి కొనియాడారు. మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ కార్పొరేషన్ గెలిపించి ప్రజలు ప్రభుత్వానికి గిఫ్టుగా ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. మేయర్ ఎన్నిక తర్వాత అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply