Telangana | ప్రతి గింజ కొనుగోలు చేస్తాం
Telangana | నర్సంపేట, ఆంధ్రప్రభ : రైతు తెచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేయడం జరుగుతుందని పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ (Pendem Ramanand) అన్నారు. నర్సంపేట పట్టణంలోని కమలాపురంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర రైతు మిత్ర సంఘం కమలాపురం (Kamalapuram) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. రైతులు ధాన్యంలో పొల్లు లేకుండా తేమ శాతం సరి చూసుకుని కొనుగోలు కేంద్రానికి తేవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఇఓ అభిబ్, కిసాన్ కాంగ్రెస్ (Kisan Congress) పట్టణ అధ్యక్షులు ముత్తినేని వెంకన్న, జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట పట్టణ వర్కింగ్ పంబి వంశీకృష్ణ, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, నర్సంపేట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధోని కీర్తన, ప్రధాన కార్యదర్శి గద్ద జ్యోతి, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, శ్రీ వెంకటేశ్వర రైతు సంఘం అధ్యక్షులు ముత్తినేని వీరయ్య, ప్రధాన కార్యదర్శి కోరే మల్లేష్, కార్యదర్శి కంచు రవి, కోశాధికారి లోడె పెద్దరాజు, పూజారి సారంగం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

