బస్సు ప్రమాద బాధితులకు అండగా ఉంటాం
- మంత్రి టీజీ భరత్
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : చిన్నటేకూరు సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాద(Bad bus accident) ఘటనలో మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ఆర్థిక సాయం అందజేశారు. వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం తరఫున సంస్థ ప్రతినిధులు మొత్తం రూ.40 లక్షల చెక్కును రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్(T.G. Bharat), జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితల సమక్షంలో కర్నూలు కలెక్టరేట్‌లో గురువారం అందజేశారు.
ఈ సందర్భంగా బస్సు యాజమాన్యం(bus ownership) మృతులైన 19 మందికి తలా రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన నలుగురికి తలా రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని మంత్రి టి.జి. భరత్ పేర్కొన్నారు. కలెక్టర్ డా.ఏ.సిరి(Collector Dr.A.Siri) మాట్లాడుతూ, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

