అన్ని జాగ్రత్తలు తీసుకుని గేట్లు ఎత్తాం
మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : గత ప్రభుత్వం హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు(K. Tarakarama Rao) (కేటీఆర్)కు మూసీ నదిపై ఎలాంటి అవగాహన లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. ఎమ్మెల్యే బీఎల్ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్(Shankar Naik)లతో కలిసి మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండు ఆకస్మికంగా తనిఖీ(Inspection), అలాగే బస్టాండ్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం మిర్యాలగూడలో ఈ రోజు ప్రెస్‌మీట్(press meet)లో పొన్నం మాట్లాడారు. ప్రభుత్వపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నతర్వాతే మూసి గేట్లు ఎత్తినట్లు తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ(BRS, BJP)లు బురద రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. అందర్నీ అప్రమత్తం చేసి 12 పునరావస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. బాధితులను పునరావస కేంద్రాలకు క్షేమంగా తరలించామని చెప్పారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలు.. ప్రతిపక్షాలు అన్నీ ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టించొద్దంటూ అని అన్నారు.
కేబినెట్ ఆమోదంతోనే…
కేబినెట్(Cabinet) ఆమోదంతోనే 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేశామన్నారు. అలాగే బీసీ రిజర్వేషన్ల(BC Reservations)తో ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. రిజర్వేషన్లపై అపోహలు వద్దని, తప్పుడు ప్రచారం నమ్మొద్దని కోరారు. రిజర్వేషన్ ల ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్(Notification) వస్తుందని భావిస్తున్నానని, కోర్టు తీర్పుని ఎవరైనా సరే గౌరవించాల్సిందే అని అన్నారు. రాజ్యాంగబద్ధంగా(Constitutionally), చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేశామన్నారు.

