Vijayawada | సమన్వయంతో పని చెయ్యాలి..

Vijayawada | సమన్వయంతో పని చెయ్యాలి..
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర..
Vijayawada | విజయవాడ, ఆంద్రప్రభ : శాఖలన్ని సమన్వయంతో పని చెయ్యాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ (Commissioner) ధ్యానచంద్ర అన్నారు. శనివారం తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్, బెంజ్ సర్కిల్ నేషనల్ హైవే సర్వీస్ రోడ్, రాణి గారి తోట ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అందుకు అనుగుణంగా శాఖలన్నీ సమన్వయంతో పని చెయ్యాలని, ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, ఇంజనీరింగ్ సిబ్బంది అభివృద్ధి పనులు చేస్తున్న, హార్టికల్చర్ సిబ్బంది డివైడర్లలో గ్రీనరీ పనులు చేస్తున్న, ప్రజారోగ్య సిబ్బంది తో సమన్వయం చేసుకుంటూ, నగర పరిశుభ్రతలో ఎటువంటి లోపం లేకుండా వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించేటట్టు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి రాణి గారి తోట వద్ద గల అన్న క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నా క్యాంటీన్ లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆహారంలో నాణ్యత, సమయపాలన, పారిశుధ్య నిర్వహణ కచ్చితంగా జరిగేటట్టు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని అధికారులను ఆదేశించారు.
