ఖమ్మం, ఆంధ్ర‌ప్ర‌భ : ప్ర‌జ‌లు కోరుకున్న విధంగా పాల‌న సాగిస్తున్నామ‌ని, ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌న్నీ అమ‌లు చేస్తున్నామ‌ని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క(Mallu Patti Vikramarka) అన్నారు. ఈ రోజు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం(Telangana Public Governance Day) సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. తెలంగాణ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీనిలో భాగంగా 2030 నాటికి లక్ష 98 వేల కోట్ల పెట్టుబడితో 20 వేల మెగావాట్ల పునర్వినియోగ శక్తి ఉత్పత్తి ద్వారా 1,14,000 మందికి ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు.

ఇందిరా మహిళా శక్తి పథకం(Indira Mahila Shakti Scheme) కింద మహిళా సంఘాల ద్వారా 2000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తికి ప్రణాళికలు చేపట్టామన్నారు. ఇందిరా సౌర గిరి జలవికాసం పథకం కింద 2025- 26 ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో 550 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నమ‌ని తెలిపారు . పేదల సంక్షేమ పథకాలు అందించడంలో రేషన్ కార్డుల పాత్ర చాలా కీలకమైందని, గత ప‌దేళ్లుగా నిరుపేదలకు రేషన్ కార్డులు జారీలో అప్పటి పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ విషయాన్ని ప్రజా ప్రభుత్వం గమనించి అర్హులైన పేదలకు తెల్ల రేషన్ కార్డు జారీ చేసి ప్రతి వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.

ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు నూతనంగా 24, 818 మంది కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు జారీ చేశామని, దాని ద్వారా 1 లక్ష 3 వేల 166 కుటుంబాలు కుటుంబ సభ్యులు ఉచితంగా రేషన్ పొందుతున్నారని భ‌ట్టి అన్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 4 కోట్ల 44 లక్షల48 వేల224 ఉచిత బస్సు ప్రయాణాలు చేయడం వల్ల మహిళలు 209 కోట్ల 21 లక్షల 46 వేల రూపాయలు ఆదా చేశారు అన్నారు. గృహ జ్యోతి పథకం కింద జిల్లాలో ప్రభుత్వం చే 160 కోట్ల 30 లక్షల రూపాయల సబ్సిడీ చెల్లించి 2 లక్షల43 వేల 852 కుటుంబాలకు లబ్ధి చేకూర్చామని తెలిపారు.

మొదటి విడతగా ఖమ్మం(Khammam) జిల్లాలో నియోజకవర్గంలో 3500 ఇండ్లు మంజూరు చేశామని భ‌ట్టి అన్నారు. ఇప్పటివరకు నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాలో 122 కోట్ల 89 లక్షల జమ చేశామన్నారు.నిరు పేదలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితి ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం జరిగిందన్నారు. ఇందుకు గాను జిల్లాలో ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 10,876 మందికి వైద్య సేవలు అందించి 22 కోట్ల 90 లక్షల 57 వేల రూపాయలను ఖర్చు చేశామన్నారు.

సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో 1 లక్ష 38వేల 790 ఎకరాల లో కొత్త ఆయకట్టును సాగు చేసి వసతి కల్పన చేస్తున్నామని భ‌ట్టి అన్నారు. రఘునాధపాలెం మండలంలో చెరువుల కింద సాగునీటి సరఫరా చేసి మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 455 ఎకరాలకు కొత్త ఆయకట్టు, 1957 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పూర్తి చేశామన్నారు. మున్నేరు నది నుండి సీతారామ ఎత్తిపోత పథకం లింకు కెనాల్ పనులు 107 కోట్లతో మంజూరు చేశామన్నారు. మధిర నియోజకవర్గం(In Madira constituency)లోని ఏరూరుపాలెం తోపాటు మధిర మండలాల్లో నాగార్జునసాగర్ జోన్ -3 రైతులకు సాగునీరు అందించేందుకు 630 కోట్లతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశామని తెలిపారు.

ఖమ్మం జిల్లాలో 1257 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో 70,257మంది విద్యార్థులు విద్యార్థులు ఉచితంగా విద్యను పొందుతున్నారని భ‌ట్టి తెలిపారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఒక 1840 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 12,542 మంది గర్భిణీలు బాలింతలు ఆరు సంవత్సరాల లోపు వయసుగల 35,282 మంది పిల్లలకు పౌష్టికాహారంతో పాటు విద్యను అందిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో ఆర్ అండ్ బి శాఖ ద్వారా 180 కోట్లతో మున్నేరు నదిపై తీగల వంతెన నిర్మాణ పనులు 130 కోట్లతో వైద్య కళాశాల భవన నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. అదేవిధంగా 139 కోట్లతో పది రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారులుగా విస్తరించామ‌న్నారు. జిల్లాలో మధిర, సత్తుపల్లి పట్టణాల్లో 34 కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ వంద పడకల ఆసుపత్రులను కల్లూరులో 10 కోట్ల 50 లక్షలతో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను, పెనుబల్లిలో ఏడు కోట్ల యాభై లక్షలతో ముప్పై పడక కమ్యూనిటీ సెంటర్ ను పూర్తి చేశామ‌ని అన్నారు. పాలేరు, సత్తుపల్లి పట్టణాలలొ 25 కోట్ల తోపున ఖర్చు చేసి చేపట్టిన నూతన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు వైరా పట్టణంలో 37 కోట్ల 50 లక్షల ఖర్చులు చేపట్టిన 100 పడకల ఆసుపత్రి భవనం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో 23 కోట్ల 50 లక్షలతో చేపట్టిన క్రిటికల్ కేర్ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. వన మహోత్సవం కార్యక్రమం కింద 35 లక్షల 32 వేల మొక్కలు నాటడం లక్ష్యంగా చేప‌ట్టామ‌ని, ఇప్పటివరకు 29 లక్షల 100 మొక్కలు నాటిన‌ట్లు చెప్పారు.

Leave a Reply