Nizamabad | వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పరిశీలన
Nizamabad | బోధన్ , ఆంధ్రప్రభ : బోధన్ పట్టణానికి నీటిని సరఫరా చేసే వాటర్ ట్రీట్మెంట్ (Treatment) ప్లాంట్ ను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ ఈ రోజు పరిశీలించారు. బోధన్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన పన్నుల వసూళ్లపై అధికారులతో సమీక్షించారు. అనంతరం రాకాశీ పెట్ లోని వాటర్ వర్క్స్ కు వెళ్లి నీటి సరఫరాను పరీక్షించారు. ఫిల్టర్ బెడ్ల మరమ్మతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నారు.

