యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : గోదావరి (Godavari) డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ఫేజ్-1లోని సాంకేతిక మరమ్మతులు కారణంగా 13 మండలాలకు రేపటి నుంచి రెండు రోజులు నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు మిషన్ భగీరథ (Mission Bhagiratha) భువనగిరి డివిజన్ కార్యనిర్వహణ ఇంజనీరు కరుణాకరణ్ (Karunakaran) తెలిపారు. కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద ఉన్న 3000 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయినుకు 900 ఎంఎం డయా వాల్వులు అమర్చనుండగా రేపు ఉదయం ఆరు గంటల నుంచి 11న ఉదయం ఆరు గంటల వరకు పనులు కొనసాగుతాయని, మరమ్మతులు (Repairs) కారణంగా తాగు నీటిని రెండు రోజుల పాటు బంద్ చేస్తున్నట్లు తెలిపారు.
నీటి సరఫరా నిలిపివేస్తున్నమండలాలు..
భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి, బీబీనగర్ , వలిగొండ, రామన్నపేట (8 గ్రామాలు), పోచంపల్లి (16 గ్రామాలు మున్సిపాలిటీ కింద కొత్తగా చేరిన 9గ్రామాలు)
ఆలేరు నియోజకవర్గంలోని, రాజాపేట, ఆత్మకూరు, యాదగిరిగుట్ట , ఆలేరు, గుండాల, తుర్కపల్లి, మోటకొండూరు, బొమ్మలరామారం మండలాలు.