సింగూరు దిగువకు నీటి విడుదల

సింగూరు దిగువకు నీటి విడుదల

ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : సింగూర్ ప్రాజెక్టు(Singur project) ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దిగువ ప్రాంతాలకు మధ్యాహ్నం ఒంటి గంట తరవాత ఏ క్షణంలోనైనా నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రాజెక్ట్ ఏఈ మైపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ పై ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టుకులోకి ప‌ది వేల‌ క్యూసెక్కులు(Cusekku) వరద నీరు వచ్చి చేరిందని పేర్కొన్నారు.

ప్రాజెక్టు దిగువ ప్రాంతాల వారు ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పశువులు, గొర్ల కాపరులు(Shepherds), చేపల వేటకు పోయే వారు నది లోనికి వెళ్లరాదని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply