వాషింగ్టన్ డిసి – అమెరికా, (america ) బ్రిక్స్ దేశాల (Brics nations ) )మధ్య వాణిజ్య యుద్ధం ( commerce war ) మరింత తీవ్ర రూపం దాల్చింది. బ్రిక్స్ కూటమి అనుసరిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే ఏ దేశంపైన అయినా అదనంగా 10 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (president trump ) సంచలన ప్రకటన చేశారు. ఈ విధానంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ నేడు ఈ హెచ్చరికలు జారీ చేశారు. “బ్రిక్స్ కూటమి అవలంబిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలతో ఏ దేశం ఏకీభవించినా, ఆ దేశంపై అదనంగా 10 శాతం సుంకం విధిస్తాం. ఈ విషయంలో మీరంతా దృష్టి సారించినందుకు ధన్యవాదాలు” అని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త సుంకాల విధానానికి సంబంధించిన అధికారిక లేఖలను నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి వివిధ దేశాలకు పంపనున్నట్లు మరో సందేశంలో తెలిపారు.
ప్రస్తుతం బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో అమెరికా ఏకపక్షంగా సుంకాలను పెంచడంపై బ్రిక్స్ దేశాల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ఏకపక్షంగా, విచక్షణారహితంగా సుంకాలను పెంచడం, ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం” అని బ్రిక్స్ దేశాలు ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి. పర్యావరణ పరిరక్షణ పేరుతో అభివృద్ధి చెందుతున్న దేశాలపై కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు వాణిజ్య ఆంక్షలు విధించడాన్ని కూడా వారు తప్పుబట్టారు.
ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు సౌదీ అరేబియా, ఈజిప్ట్, యూఏఈ, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. బ్రిక్స్ దేశాల ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
తొమ్మిదో తేది తర్వాత ….
ఏప్రిల్ 2న ఆయా దేశాలపై ట్రంప్ సుంకాలు ప్రకటించారు. అనంతరం వ్యతిరేకత రావడంతో మూడు నెలల పాటు వాయిదా వేశారు. ఆ గడువు జూలై 9తో ముగుస్తుంది. ప్రస్తుతం యూకే, వియత్నాం, చైనా మాత్రమే అమెరితో ఒప్పందాలు చేసుకున్నాయి. మిగతా దేశాలు చేసుకోలేదు. ట్రంప్ విధించిన డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. అయితే భారత్‌లో వ్యవసాయం. పారి పరిశ్రమలపై అమెరికా రాయితీలు కోరుతోంది. అయిదే ఇవే మన దేశానికి సెంటిమెంట్. ఈ నేపథ్యంలోనే భారత్ వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. రేపటిలోగా ఏదొక ప్రకటన వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.