ఎంపీ కేశినేని గురించి మాట్లాడే అర్హత వైసీపీ పేటిఎం బ్యాచ్ కు లేదు

ఎంపీ కేశినేని గురించి మాట్లాడే అర్హత వైసీపీ పేటిఎం బ్యాచ్ కు లేదు

ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ను విమర్శించే నైతిక అర్హత దేవినేని అవినాష్‌కు లేదు
టీఎన్ టీ యూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్

విజయవాడ, ఆంధ్రప్రభ : అత్యంత ప్రజాదరణతో 2.80లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో విజయవాడ పార్లమెంటు సభ్యునిగా గెలిచిన ప్రజా నాయకులు కేశినేని శివనాథ్ ( చిన్ని) అని టిఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్ అన్నారు. అటువంటి నాయకుడు ఎంపీ కేశినేని శివనాధ్ గురించి మాట్లాడే నైతిక అర్హత వైసిపి పేటిఎం బ్యాచ్ నాయకుడు దేవినేని అవినాష్‌కు లేదన్నారు.

ఎంపీ కేశినేని శివనాధ్‌పై అవినాష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. విజయవాడ నగరంలో దౌర్జన్యాలు, దోపిడీలు, కబ్జాలకు పేర్గాంచిన కుటుంబం దేవినేని అవినాష్ కుటుంబమన్నారు. దోచుకోవడానికి , దాచుకోవడానికి రాజకీయ భిక్ష పెట్టిన టిడిపిని వదిలి వైసిపిలో చేరిన అవినాష్ వైసిపి ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో చేయని అవినీతి లేదన్నారు. మట్టి తరలింపు మొదలుకుని సెటిల్‌మెంట్లు వరకు తన కార్యాలయంనే అడ్డాగా మార్చాడన్నారు. ఏలూరు రోడ్డులో ఎన్ని స్థలాలు దేవినేని అవినాష్ కుటుంబం కబ్జా చేసిందో వియవాడ వాసులందరికీ తెలుసు అని, దేవినేని అవినాష్ కుటుంబ రౌడీయిజానికి భయపడే మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసినా అవినాష్‌ను ఒక్కసారి కూడా ప్రజలు గెలిపించలేదన్నారు.

రేషన్ బియ్యం మాఫియా మొత్తం దేవినేని అవినాష్ అనుచరులేనని, వైసిపికి చెందిన వారే అన్నారు. అవినీతి, దోపిడీలకు కేరాఫ్‌గా మారిన అవినాష్ ప్రజా నాయకులైన ఎంపీ కేశినేని శివనాథ్‌ను విమర్శించడంను సరికాదన్నారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన విజయవాడ పార్లమెంటరీ ప్రజలకు మేలు చేసేందుకు నిరంతరం తపన పడుతున్న ఎంపీ కేశినేని శివనాథ్‌పై అవాకులు చవాకులు పేలితే ప్రజలే సహించరన్నారు. తన స్థాయిని మరిచి దేవినేని అవినాష్ మాట్లాడుతున్నాడని, జగన్ మోహన్‌రెడ్డి మెప్పుకోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు.

జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ వచ్చినపుడు స్వాగతం పలకడం, వెళ్లేటప్పుడు సెండాఫ్ ఇవ్వడం డిపార్చర్, ఎరైవల్ గా దేవినేని అవినాష్ (డీఎ) సరిపోతాడని, ఎన్నటికీ ప్రజా నాయకుడు కాలేడన్నారు. దేవినేని అవినాష్ ఇప్పటికైనా తన తప్పులు తెలుసుకుని నోరు అదుపులో పెట్టుకుని నడుచుకోవాలని హితవు పలికారు. లేదంటే రానున్న కాలంలో ప్రజలంతా అవినాష్‌కు, వైసిపి నాయకులకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు.

Leave a Reply